వార్తలకు తిరిగి వెళ్లండి

మనూర్ మండలం బోరంచ గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Comments
Loading comments...

