వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో బోనాల పండగ నిర్వహించారు. మహిళలు బోనాలతో గ్రామ దేవత ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

