వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బంజారాహిల్స్ ఎస్సై కొత్తూర్ విజయ్‌పై లంచం డిమాండ్ ఆరోపణలతో అనిశా అధికారులు కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండేందుకు నిందితుడిని తొలుత రూ.10 లక్షలు, మరో కేసులో రూ.2 లక్షలు ఇవ్వాలని కోరినట్లు ఆరోపణలున్నాయి.
నిందితుడి ఫిర్యాదుతో బుధవారం డీఎస్పీ గంగస్వామి శ్రీధర్ ఎస్సైని అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం తీసుకోకపోయినా డిమాండ్ చేయడం నేరమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

