Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీకేజ్ మరమ్మతులు పూర్తి.. నీటి సరఫరా షురూ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:14 AM అనకాపల్లి General
లీకేజ్ మరమ్మతులు పూర్తి.. నీటి సరఫరా షురూ - Udayam
కోటవురట్ల మండలం గొట్టివాడ పైలట్ ప్రాజెక్ట్ పైప్‌లైన్‌కు ఎస్.రాయవరం మండలం కొత్తూరు చెరువులో లీకేజ్ ఏర్పడింది. దీంతో ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారుల పర్యవేక్షణలో నీటిని తోడించి చేపట్టిన మరమ్మతులు ఆదివారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో సోమవారం నుంచి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...