వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో కొండాపురం మండలం గానుగపెంట, సత్యవోలు, నేకునాంపేట ఎంపీటీసీ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

