Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిన కెనాల్‌ బ్రిడ్జి.. రాకపోకలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 12:43 PM కామరెడ్డిGeneral
కూలిన కెనాల్‌ బ్రిడ్జి.. రాకపోకలకు ఇబ్బందులు - Udayam
నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్పల్లి, బైరాపూర్‌ శివారులో నిజాంసాగర్‌ ప్రధాన కాలువైన 26/4 కెనాల్‌ బ్రిడ్జి కొంతభాగం కూలిపోయింది. ఈ మార్గంలో శ్రీ విట్టల రుక్మిణి మందిరానికి నిత్యం వందలాది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా స్థానిక రైతులు ప్రస్తుతం మొరం వేశారు. అధికారులు స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మించాలని వాహనదారులు, భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...