వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కుప్పంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఎస్పీ హేమంత్, అర్బన్ సీఐ జీటీ నాయుడు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోని దుకాణాలను ఖాళీ చేయించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేయనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

