Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తె పుట్టినరోజున పాఠశాల నిర్మాణం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:22 AM అల్లూరి General
కుమార్తె పుట్టినరోజున పాఠశాల నిర్మాణం - Udayam
కుమార్తె పుట్టినరోజు వేడుకల ఖర్చుతో ఐఎఫ్‌ఎస్ అధికారి శెట్టి ప్రదీప్‌కుమార్ గిరిజన విద్యార్థుల కోసం పాఠశాల భవనం నిర్మించారు. హుకుంపేట మండలం మదుము గ్రామంలో రూ.3 లక్షలతో నిర్మించిన భవనాన్ని శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి ప్రారంభించారు. 15 ఏళ్లుగా సొంత భవనం లేక ఇబ్బందిపడుతున్న 25 మంది విద్యార్థులకు ఈ నిర్మాణంతో ఊరట లభించింది. ప్రదీప్‌కుమార్ కుటుంబాన్ని స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...