Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్లీ పుష్కర ఘాట్‌లో పారిశుద్ధ్య లోపం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:15 PM నిజామాబాద్General
కోస్లీ పుష్కర ఘాట్‌లో పారిశుద్ధ్య లోపం - Udayam
నవీపేట్‌ మండలం కోస్లీ గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్‌లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఘాట్‌ మెట్లపై చెత్త పేరుకుపోవడంతో పాటు చెట్ల పొదలు పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు తలుపులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఘాట్‌ను శుభ్రం చేయడంతో పాటు గదులకు తలుపులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...