వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, చేతికొచ్చిన మొక్కజొన్న, పత్తి పంటలను పొలాల నుంచి ఇళ్లకు తరలిస్తున్నారు.
అష్టకష్టాలు పడి పండించిన పంట వర్షార్పణం కాకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పంటను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Loading comments...

