Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొక్కిలిగడ్డలో పిల్లర్లకే RBK భవనం

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:58 AM కృష్ణా జిల్లాGeneral
కొక్కిలిగడ్డలో పిల్లర్లకే RBK భవనం - Udayam
మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో రూ.23.94 లక్షలతో నిర్మించతలపెట్టిన రైతు భరోసా కేంద్రం భవనం పిల్లర్లకే పరిమితమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన ఈ భవనం నిధులు, ఇతర కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం భవనం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయాయి. అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా కేంద్రం భవనాన్ని పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...