వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని నల్లగట్టు మారెమ్మ గుడి సమీపంలో ఈ నెల 8న జరిగిన కిరాణా షాపు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మక్తల్ మండలం చందాపూర్కు చెందిన పాత నేరస్థుడు నరసింహులు 44ను ఎస్ఐ అశోక్ బాబు దర్యాప్తులో భాగంగా బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు.
నిందితుడి నుంచి బంగారు,వెండి ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

