వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఖమ్మంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు.
మహిళల సందడితో ప్రాంగణం కళకళలాడింది. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు విష్ణు, నాయకురాలు రమ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

