వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలం ఖిలా వనపర్తి దుర్గామాత మండపం వద్ద గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడికందుల సతీశ్ 16 మంది మాదిగ కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు. డప్పు కళా సంస్కృతిని కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
డప్పులు అందుకున్న కళాకారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనుకయ్య, మాజీ ఎంపీపీ హనుమయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూపుల నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

