వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి మూడో వార్డు వైసీపీ అభ్యర్థిగా జంపాల వెంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తల సందడి మధ్య ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించారు. అంతకుముందు వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు.
మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని వెంగమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

