వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బండ్లగూడలో వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో వీధి శునకం మృతి చెందింది. ఈ నెల 22న అనుదీప్ నిర్లక్ష్యంగా కారు నడిపి శునకాన్ని ఢీకొట్టినట్లు జంతు ప్రేమికురాలు మీనాక్షి ఆరోపించారు. తీవ్రంగా గాయపడిన శునకం చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది.
ఏడు పిల్లలకు జన్మనిచ్చిన శునకం మృతిపై మీనాక్షి నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

