వార్తలకు తిరిగి వెళ్లండి

కాగజ్నగర్ ఎంపీడీవో కార్యాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ సందడి చేశారు.
బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రకృతితో మమేకమై జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. పూల బతుకమ్మలతో కార్యాలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది.
Comments
Loading comments...

