వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడంతో జనగామలో పోలీసులు సోమవారం ముందస్తు అరెస్టులు చేశారు. ముట్టడిలో పాల్గొనకుండా పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టులను ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన తమను అరెస్టు చేయడం సరికాదని పేర్కొంటూ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

