Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాధివాసం వీడిన సంగమేశ్వర క్షేత్రం

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:32 AM మహబూబ్‌నగర్General
జలాధివాసం వీడిన సంగమేశ్వర క్షేత్రం - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల సమీపంలోని సప్తనదుల సంగమ ప్రాంతంలో వెలసిన ప్రముఖ సంగమేశ్వర క్షేత్రం జలాధివాసాన్ని వీడింది. కృష్ణానదిలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతుండటంతో ఆలయం వెనక భాగంతో పాటు ముందువైపున్న విగ్రహాలు గురువారం బయటపడ్డాయి. దేవాలయం పూర్తిగా వెలుగుచూడటంతో దసరా పండుగ నాటికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పురోహితుడు తెల్కపల్లి రఘురామశర్మ తెలిపారు.

Comments

G
Loading comments...