Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఐపీఓకు కోటికి పైగా దరఖాస్తులు.. ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
Shruthi Oct 23, 2026 9:48 PM జాతీయంవాణిజ్యం
జియో ఐపీఓకు కోటికి పైగా దరఖాస్తులు.. ప్రపంచ రికార్డు - Udayam
రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒక ఐపీఓకు ఇన్ని దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇష్యూ ముగియడానికి ఐదు గంటల ముందే ఈ మైలురాయిని చేరుకుంది. గతంలో 97 లక్షల దరఖాస్తులతో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. బిడ్డింగ్ ముగిసే సమయానికి దరఖాస్తులు మరింత పెరిగే అవకాశముందని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...