వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వాల్మీకి జీవిత విశేషాలు, రామాయణ రచన విశిష్టతను ఉపసర్పంచ్ కరుణాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

