వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో జియో పెట్రోల్ పంపు సమీపంలో కారు ఢీకొని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంజయ్ కుమార్ గోస్వామి (45) మృతి చెందిన ఘటనలో డ్రైవర్ పుల్ల మహేశ్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న జరిగిన ప్రమాదంలో గాయపడిన సంజయ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
ప్రమాదం అనంతరం పరారైన మహేశ్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
Comments
Loading comments...

