Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ కటౌట్‌.. మౌళికి మధురానుభూతి

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 7:35 AM జాతీయంవినోదం
జగదాంబ కటౌట్‌.. మౌళికి మధురానుభూతి - Udayam
ఒకప్పుడు జగదాంబ థియేటర్‌లో సినిమాలు చూసిన తాను.. ఇప్పుడు అదే థియేటర్‌ వద్ద తన కటౌట్‌ చూసుకోవడం మరిచిపోలేని అనుభూతి అని హీరో మౌళి అన్నారు. విశాఖతో తనకున్న అనుబంధం ప్రత్యేకమని ‘డీఎన్‌కే’ సినిమా విజయోత్సవంలో పేర్కొన్నారు. వరుసగా రెండు సినిమాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు కంబాల శ్రీను మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణతో విడుదలైన మూడు రోజుల్లోనే సినిమా లాభాల్లోకి వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...