వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులోని ఇథనాల్ కంపెనీ నుంచి తీవ్ర శబ్ద కాలుష్యం వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాయిలర్ స్టీమ్ను ఒక్కసారిగా విడుదల చేసే సమయంలో పెద్ద శబ్దం వస్తోందని తెలిపారు.
రాత్రి వేళల్లోనూ శబ్దం రావడంతో పిల్లలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

