వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం నుంచి 60 మంది అయ్యప్ప స్వాములు 38 రోజుల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇరుముడి, మహాపడిపూజ, ప్రత్యేక పూజల అనంతరం శబరిమలకు బయలుదేరారు. ఉజ్జయిని మహంకాళి ప్రధాన పంతులు వేణుమాధవ శర్మ, గురుస్వామి వీఎస్‌వీ రమణ ఆశీస్సులందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముత్యాల శ్యామల భాస్కర్ అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

