Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూర్‌నగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య

Follow Udayam on Google
Shruthi Oct 21, 2026 9:26 PM నల్గొండGeneral
హుజూర్‌నగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య - Udayam
హుజూర్‌నగర్‌లోని సుందరయ్య నగర్ కాలనీలో మామిడి రాములమ్మ (74) అనే వృద్ధురాలు హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ వెనుక బజారు ఆరో వార్డు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బంగారు ఆభరణాల కోసమే దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఎస్సై చలికంటి నరేశ్, పోలీసు సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...