వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిల పుణ్యక్షేత్రం శనివారం హరినామ సంకీర్తనలతో పులకరించింది. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు నగర సంకీర్తన నిర్వహించారు. దిగువ అహోబిలం పరిధిలో భక్తి గీతాలు, భజనలు ఆలపించారు.
ఆలయ ప్రదక్షిణగా నగర సంకీర్తన చేపట్టి నరసింహ స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
Comments
Loading comments...

