వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో అనధికారిక చీటీల పేరుతో భారీ మోసాలు వెలుగుచూశాయి. కేపీహెచ్‌బీలో ఓ కుటుంబం 60 మంది నుంచి సుమారు రూ.40 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అమీన్‌పూర్‌లో మరో దంపతులు రూ.2 కోట్లతో అదృశ్యమైనట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ ఏడాది హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో రూ.300 కోట్లకుపైగా చీటీ మోసాలపై 30కిపైగా కేసులు నమోదయ్యాయి. అనుమతి ఉన్న సంస్థల్లోనే చీటీలు వేయాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

