వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండలంలో 20 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఎన్నికల కోసం 61 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఎంపీడీవో గోవిందు సోమవారం తెలిపారు. ఓటింగ్ నిర్వహణకు 92 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామన్నారు.
అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అక్టోబర్ 25న నామినేషన్ల పరిశీలన చేపడతామని వెల్లడించారు.
Comments
Loading comments...

