వార్తలకు తిరిగి వెళ్లండి

మునగపాక మండలం గణపర్తి రామాలయంలో బుధవారం అమ్మానాన్నల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్ద చదరం నాయుడు, VHP నేత శరగడం పరదేశినాయుడు ఆధ్వర్యంలో 10 మంది వయోవృద్ధులను సత్కరించారు.
తల్లిదండ్రుల గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఏటా ఈ వేడుక నిర్వహిస్తున్నామని పరదేశినాయుడు తెలిపారు. పెద్దలను గౌరవిస్తూ వారి బాటలో నడవాలని విశ్రాంత ప్రొఫెసర్ తులసీరావు సూచించారు.
Comments
Loading comments...

