వార్తలకు తిరిగి వెళ్లండి

గార్ల మండలం మర్రిగూడెం సమీపంలోని శ్రీ వేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏటా అశ్వయుజ మాసంలో ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ కమిటీ ఛైర్మన్ అజ్మీరా బన్సీలాల్ తెలిపారు.
ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

