వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై రూట్, జోనల్ అధికారులతో సహాయ ఎన్నికల అధికారి రవీంద్ర సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రవీంద్ర సూచించారు. విధులపై స్పష్టతతో పాటు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

