వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధభూమిలో ఎనిమిది నెలలు చిక్కుకున్న ఉక్రెయిన్ సైనికుడు కోస్టియాంటిన్ వ్లాసెంకోను భారీ డ్రోన్‌తో రక్షించారు. రష్యా డ్రోన్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన శిథిల భవనం కింద తలదాచుకున్నాడు.
సహాయక వాహనాలను రష్యా దళాలు ధ్వంసం చేయడంతో రక్షణ కష్టమైంది. ఈ క్రమంలో వ్లాసెంకో తన పాదాన్ని తానే నరుక్కున్నాడు. చివరకు ఉక్రెయిన్ సైన్యం భారీ డ్రోన్ సాయంతో ఆయన్ను 15 కి.మీ. దూరంలోని సురక్షిత ప్రాంతానికి తరలించింది.
Comments
Loading comments...

