వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని SDMA హెచ్చరించింది. ఈ అల్పపీడనం 26వ తేదీ నాటికి తుఫానుగా మారే అవకాశం ఉండటంతో సోమవారం నుంచి వర్షాలు, మంగళ, బుధవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

