వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన బోడ లింగం(49) ద్విచక్రవాహనంపై వెళ్తూ గుండెపోటుతో మృతి చెందారు. బోరు మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్న ఆయన బుధవారం జనగామలో మరమ్మతులు పూర్తిచేసుకుని స్వగ్రామం ఇటుకాలపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు.
సిద్దిపేట రోడ్డు వంతెన వద్ద ఒక్కసారిగా కుప్పకూలారు. వాహనదారులు సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. పోలీసులు మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

