వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండుగ నేపథ్యంలో అశ్వారావుపేట మండలంలో సంప్రదాయ వేషధారుల సందడి మొదలైంది. శివుడు, పార్వతి, శివగణాల వేషాలు ధరించిన కళాకారులు గ్రామాల్లో తిరుగుతూ అమ్మవారి పేరుతో భిక్ష స్వీకరిస్తున్నారు.
ఏడాది పొడవునా వ్యవసాయ పనులు చేసుకుంటూ, నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మాత్రమే వేషాలు ధరించడం వీరి ప్రత్యేకత. కనుమరుగవుతున్న ఈ సంప్రదాయ కళలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

