వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా పండగ సమీపిస్తుండటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు పెద్దసంఖ్యలో బయలుదేరడంతో రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.
దీంతో పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

