Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా ప్రత్యేక బస్సులతో రూ.57 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 2:22 PM నెల్లూరుGeneral
దసరా ప్రత్యేక బస్సులతో రూ.57 లక్షల ఆదాయం - Udayam
దసరా సందర్భంగా నెల్లూరు ఆర్టీసీ రీజియన్‌లో నడిపిన ప్రత్యేక బస్సులతో రూ.57,05,984 ఆదాయం లభించింది. ఈ నెల 12 నుంచి 23 వరకు ఆత్మకూరు, గూడూరు, కావలి, నెల్లూరు, రాపూరు, ఉదయగిరి డిపోల నుంచి 222 ప్రత్యేక బస్సులు నడిపారు. ఈ బస్సుల్లో 37,681 మంది ప్రయాణించారు. 87.31 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు నడిచినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...