వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అర్హులైన దళిత ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలని ఎమ్మార్పీఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్ల చంద్రస్వామి మాదిగ కోరారు. ఈ మేరకు శనివారం యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.
పదోన్నతుల్లో వివక్షపై సమగ్ర విచారణ జరిపి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

