వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని వన్టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. శనివారం పట్టణ ప్రజలతో మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.
ప్రజలు గుంపులుగా గుమిగూడకూడదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

