Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:25 AM జాతీయంవాణిజ్యం
తగ్గిన డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం - Udayam
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.913.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,462.8 కోట్లతో పోలిస్తే లాభం 36% తగ్గింది. కార్యకలాపాల ఆదాయం రూ.8,670.8 కోట్లకు పరిమితమైంది. అమెరికాలో లెనాలిడోమైడ్‌ ఔషధ విక్రయాలు తగ్గడం లాభంపై ప్రభావం చూపింది. మరోవైపు భారత మార్కెట్లో విక్రయాలు 17% పెరిగి రూ.1,850 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...