వార్తలకు తిరిగి వెళ్లండి

దామరగిద్ద మండలవ్యాప్తంగా ఆరో రోజు బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. “అలిగితివా బతుకమ్మ.. అలసిపోకే బతుకమ్మ” అంటూ పాటలు పాడుతూ ఆడిపాడారు. అలిగిన బతుకమ్మకు పూలు పేర్చకుండా పాయసం నైవేద్యంగా సమర్పించారు.
పలు గ్రామాల్లో తొక్కుడు బిళ్ల, కుర్చీ ఆట, స్కిప్పింగ్ వంటి ఆటలతో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
Comments
Loading comments...

