వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం చిర్రగూడెం రెవెన్యూ గ్రామ శివారులో జరుగుతున్న భూముల రీ సర్వేను తహశీల్దార్ జగదీశ్ పరిశీలించారు. సర్వే సమయంలో రైతులు హాజరై తమ భూముల హద్దులను సర్వేయర్లకు స్పష్టంగా చూపించాలని సూచించారు.
రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారమై, హద్దుల వివాదాలు తగ్గుతాయని తెలిపారు. కార్యక్రమంలో డీటీ రాహుల్ చంద్రవర్మ, ఆర్ఐలు కిరణ్ కుమార్, ధనలక్ష్మి, సర్వేయర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

