వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామ రైతులకు ఏడు దశాబ్దాల తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో ఇన్నాళ్లూ పట్టాలు మంజూరు కాలేదు.
గత నెలలో ప్రభుత్వం భూముల సర్వే చేపట్టింది. డిసెంబర్ నాటికి పాస్ పుస్తకాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామంలోని 600 మంది రైతులకు చెందిన జిరాయతీ భూములకు పాస్ పుస్తకాలు అందనున్నాయి.
Comments
Loading comments...

