Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చినరావూరులో మహిళ మెడలో గొలుసు చోరీ

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 10:50 AM బాపట్లGeneral
చినరావూరులో మహిళ మెడలో గొలుసు చోరీ - Udayam
తెనాలి పరిధిలోని చినరావూరులో శుక్రవారం 60 ఏళ్ల విజయలక్ష్మి మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని పరారయ్యాడు. ఇంటి తలుపు తీసి బయటకు వచ్చిన సమయంలో కాపు కాసిన దుండగుడు లోపలికి చొరబడ్డాడు. ఆమె తిరిగి ఇంట్లోకి రాగానే గొలుసు లాక్కొని పరారయ్యాడు. తమ ఇంట్లో దొంగతనం జరగడం ఇది రెండోసారని విజయలక్ష్మి తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...