వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లి మండలం స్నేహలత నగర్లో తాగునీటి చేతిపంపు పనిచేయక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పరిశీలించి వెళ్లిపోతున్నారే తప్ప మరమ్మతులు చేపట్టడం లేదని వాపోతున్నారు.
తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేతిపంపునకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

