Latest మార్కెట్ news and updates
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడంతో సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 77,763 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ముగిశాయి. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.