Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:01 AM మహబూబాబాద్ General
బయ్యారంలో కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు - Udayam
బయ్యారం మండల కేంద్రంలో కోతుల బెడద పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లకు వెళ్లేవారి సంచులను కోతులు లాక్కుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...