వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఐడీఓసీ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారిణులు, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.
తెలంగాణ జానపద గీతాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

