వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం సర్పంచ్ పెద్దపల్లి తిరుమల ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువు వద్ద పిచ్చి చెట్లను తొలగించి, రాత్రివేళ మహిళలకు ఇబ్బందులు కలగకుండా వీధి దీపాలు ఏర్పాటు చేయించారు.
పండుగ సమయంలో భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాలని సర్పంచ్ తిరుమల పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

